బీటీపీఎస్ కార్మికుడి ఫోన్‌లో మూడు గంటల అప్‌డేట్.. ఖాతా నుంచి రూ.20 వేలు మాయం.

G Rajashekar
By -
0

 


EB NEWS/మణుగూరు: 


మణుగూరు పట్టణంలో బీటీపీఎస్‌లో పనిచేస్తున్న ఓ కాంట్రాక్ట్ కార్మికుడు సైబర్ మోసానికి గురై రూ.20 వేల నగదు కోల్పోయాడు. మొబైల్ ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవుతున్నట్లు చూపించిన కొద్దిసేపటికే అతడి బ్యాంకు ఖాతా నుంచి రెండు విడతల్లో నగదు బదిలీ అయినట్లు గుర్తించాడు.


బాధితుడి వివరాల ప్రకారం.. అతడి మొబైల్ ఫోన్‌లో సుమారు మూడు గంటల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవుతున్నట్లు స్క్రీన్ పై కనిపించింది. అనంతరం ఫోన్ తిరిగి ఆన్ అయిన వెంటనే అనుమానం రావడంతో ఫోన్‌పే లావాదేవీలను పరిశీలించాడు. దీంతో తన ఖాతా నుంచి రెండు విడతల్లో మొత్తం రూ.20 వేలు బదిలీ అయినట్లు గుర్తించాడు. 


ఇందులో గతంలో ఖాతాలో ఉన్న నగదుతో పాటు తాజాగా జమ అయిన జీతం మొత్తం కూడా ఉన్నట్లు తెలిసింది. దీంతో వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాడు.


మొబైల్ ఫోన్లలో అనుమానాస్పద సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, అపరిచిత లింకుల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏదైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)