పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
గవర్నమెంట్ ఉపాధ్యాయులల్లో ఆణిముత్యం ఎంపీపీఎస్ స్కూల్ హెడ్మాస్టర్ హనుమంతరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడుల్లా బయ్యారం మారుమూల ప్రాంతంలో గల బిసి రావిగూడెం ఎంపీపీస్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు హనుమంతరావు స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు నిరంతరం కృషి చేశారు ఆయన శ్రమ ఫలితంగా ప్రైవేట్ స్కూళ్లకు పిల్లలను పంపించే తల్లిదండ్రులకు గవర్నమెంట్ స్కూలు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ''ప్రైవేట్ స్కూల్ వద్దు గవర్నమెంట్ స్కూల్ ముద్దు'' అంటూ గ్రామంల్లోని విద్యార్థుల తల్లిదండ్రులను గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధంగా కృషి చేశారు గడిచిన సంవత్సరంలో కనీసం స్కూల్లో ఐదుగురు విద్యార్థులు ఉండగా దానిని 20కి పైగా పెంచేందుకు కృషిచేసిన స్కూల్ హెడ్మాస్టర్ హనుమంతరావును కృషిని గ్రామ ప్రజలు కొనియాడారు. వృత్తిని నిజాయితీగా ఇష్టపడి పనిచేస్తే పలితాలు ఇలాగే ఉంటాయి అని నిరూపించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి