EB NEWS/ TG:
దసరా, దీపావళి ఆఫర్ల పేరుతో సైబర్ మోసాలు!
తక్కువ ధరకే ఫోన్లు, టీవీలు అంటూ వాట్సాప్, SMSలలో వచ్చే నకిలీ లింకులతో జాగ్రత్త!
లింక్ క్లిక్ చేస్తే అసలైన షాపింగ్ సైట్‌లా కనిపించే నకిలీ వెబ్‌సైట్ తెరుచుకోవచ్చు. కార్డు వివరాలు, బ్యాంక్ సమాచారం నమోదు చేస్తే మీ ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.
మోసాల బారిన పడకుండా ఈ జాగ్రత్తలు పాటించండి:
అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ నుంచే కొనుగోళ్లు చేయండి.
వెబ్‌సైట్ అడ్రస్‌ను జాగ్రత్తగా పరిశీలించండి.
అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు.
OTP, బ్యాంక్ వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు.
సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930కి కాల్ చేయండి.
ఆఫర్లకు ఆశపడి మోసపోవద్దు.. అప్రమత్తతే మీకు రక్షణ!

