EB NEWS/కరకగూడెం:
మండలంలోని కలవలనాగారం గ్రామానికి చెందిన యువకుడు బాదావత్ రవిచంద్ర హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది.
మణుగూరు ఇన్‌చార్జి డీఎస్పీగా ఉన్న భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర రావు ఎస్సై నాగేశ్వరరావు కేసును పర్యవేక్షిస్తున్నారు.
మృతి ని తల్లి బానోత్ విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, కరకగూడెం గ్రామానికి చెందిన ఇమ్రాన్ పై అనుమానం ఉన్నట్లు మృతుడి తల్లి అనుమానం వ్యక్తం చేసినట్టు తెలిపారు.
నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని డీఎస్పీ అరుణ్ కుమార్ తెలిపారు.

