EB NEWS పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖలో బదిలీలు, పోస్టింగ్లకు సంబంధించి ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఖమ్మం వీఆర్లో విధులు నిర్వహిస్తున్న సబ్ఇన్స్పెక్టర్ పి. రఘును పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా నియమించారు.
2026 అక్టోబర్ 13న జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజు ఐపీఎస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో, ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లోని ఖాళీ స్థానంలో రఘుకు పోస్టింగ్ కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రఘును ఖమ్మం నుంచి రిలీవ్ చేసిన తేదీని తెలియజేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ను కూడా కోరారు.

