మణుగూరులో రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు.. పలువురికి గాయాలు

G Rajashekar
By -
0

 


EB NEWS/మణుగూరు, నవంబర్ 24:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సాయిబాబా ఆలయం వద్ద అతివేగంతో రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన ఒక కారు, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ (RTC) బస్సును బలంగా ఢీకొంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుల వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)