భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం కోటి 56 లక్షలు

G Rajashekar
By -
0

 


EB NEWS/భద్రాచలం:


భద్రాద్రి రామయ్య హుండీని బుధవారం నాడు అత్యంత భద్రత మధ్య లెక్కించారు. మార్చి 9వ తేదీన గతంలో లెక్కించగా తిరిగి 36 రోజుల తర్వాత బుధవారం నాడు లెక్కింపు చేపట్టారు. ఈ లెక్కింపులో వివిధ హుండీలలో భక్తులు వేసిన నగదును లెక్కించగా 1, 56, 91, 971 రూపాయలు వచ్చాయి. అంతేగాక హుండీ లెక్కింపు ద్వారా భక్తులు స్వామివారికి సమర్పించిన 34 యూఎస్ డాలర్స్ 196 మలేషియా రింగ్స్ 100 యూఏఈ డాలర్లు 80 ఇంగ్లాండు డాలర్లు 50 సౌదీ అరేబియా డాలర్లు 50 ఆస్ట్రేలియా డాలర్లు కూడా ఈ సందర్భంగా లభించాయి. అంతేకాకుండా 71 గ్రామ్ బంగారం, కేజీ 280 గ్రాములు వెండి కూడా హుండీ ద్వారా లభించాయి.

మొత్తం నగదును దేవస్థానం ఈవో దామోదర్ రావు దేవస్థానం ఖాతాలో జమ చేయడానికి స్టేట్ బ్యాంక్ అధికారులకు అందజేశారు. ఈ హుండీ లెక్కింపులో దేవస్థానం ఏఈఓ శ్రావణ్ కుమార్ సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి, కత్తి శీను తో పాటు పలువురు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)