ధాన్యం వాహనం బోల్తా – డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

G Rajashekar
By -
0

 


EB NEWS/ములుగు:


తాడ్వాయి మండలంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తద్వాయి నుంచి ధాన్యం లోడుతో వస్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి మార్గమధ్యంలో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.


ప్రమాదం కారణంగా వాహనంలో ఉన్న ధాన్యం బస్తాలు రోడ్డుమీద చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికులు వెంటనే స్పందించి ధాన్యం బస్తాలను రోడ్డుపక్కకు జరిపే ప్రయత్నం చేసి ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకువచ్చారు.


గాయపడిన డ్రైవర్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వాహనం అదుపుతప్పడానికి రహదారిలో గుంతల కారణమా లేక డ్రైవర్ అజాగ్రత్త వలన జరిగిందా అన్నది తెలియాల్సి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)