గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

G Rajashekar
By -
0

 



భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం సబ్‌ కలెక్టర్ కార్యాలయం 


EB NEWS/భద్రాచలం: 


భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి నది నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం సబ్‌ కలెక్టర్ కార్యాలయం సూచించింది. ఈ రోజు నుంచి ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.


అత్యవసర పరిస్థితులు మినహా అనవసర ప్రయాణాలను నివారించాలని సూచించారు. ముఖ్యంగా చెరువులు, కుంటలు, కాలువలు, వాగులు, నదులు, ఇతర నీటి వనరుల వద్దకు వెళ్లవద్దని తెలిపారు.


గోదావరి పరివాహక ప్రాంతాల్లో చేపలు పట్టడం, ఈత కొట్టడం, స్నానం చేయడం లేదా ఇతర అవసరాల కోసం నీటిలోకి దిగడం పూర్తిగా నివారించాలని అధికారులు సూచించారు. పిల్లలు నీటి వనరుల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.


అలాగే లోతట్టు ప్రాంతాలు, కాజ్‌వేలు, నీరు ప్రవహించే రహదారుల వద్ద ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు, గోదావరి నీటిమట్టం పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సబ్‌ కలెక్టర్ కార్యాలయం పేర్కొంది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)