భద్రాద్రి కొత్తగూడెం జిల్లా- పినపాక నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి
EB NEWS/మణుగూరు:
తుఫాన్ ప్రభావంతో పినపాక నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు సూచించారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. వాగులు, వంకలు, చెరువులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు.
విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని తెలిపారు.
ప్రజలకు ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.

