EB NEWS:కొత్తగూడెం:
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన కార్యక్రమానికి వెళ్లిన కొత్తగూడెం 2 టౌన్ ఎస్ఐ వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ వెంకన్న మృతిచెందినట్లు తెలుస్తోంది. ఆయన మృతితో కొత్తగూడెం పోలీసు శాఖలో విషాదం నెలకొంది. వెంకన్న మృతిపట్ల పోలీసు అధికారులు, సిబ్బంది సంతాపం తెలిపారు.

