మణుగూరులో వినాయకుడి లడ్డూకు భారీ ధర.. రూ.3.47 లక్షలకు సొంతం

G Rajashekar
By -
0

 


 EB NEWS/మణుగూరు:


 మణుగూరు పట్టణంలో వినాయకుడి లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది. బంగారు వెండి వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో లడ్డూకు భారీ ధర పలికింది.


వేలంలో రూ.3,47,116కు కంచర్ల శ్రీనివాస్ లడ్డూను దక్కించుకున్నారు. వేలం ప్రారంభం నుంచి దుగ్గి సతీశ్, కంచర్ల శ్రీనివాస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. చివరకు అత్యధిక ధరకు శ్రీనివాస్ లడ్డూను సొంతం చేసుకున్నారు.


లడ్డూ వేలం సందర్భంగా భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా తిలకించారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)