పినపాక: వర్షాలపై అధికారుల అప్రమత్తత.. ప్రజలకు ఎంపీడీవో కీలక సూచనలు

G Rajashekar
By -
0



 EB NEWS/పినపాక:


రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పినపాక మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో సంకీర్త్ ప్రజలందరికీ భద్రతా సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం నందు మాట్లాడుతూ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, కల్వర్టులు, లోతట్టు వంతెనల వద్దకు ఎవరూ వెళ్లకూడదని, ద్విచక్ర వాహనాలు లేదా ఇతర వాహనాలతో నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని తెలిపారు. వర్షాలకు తడిసి బలహీనపడిన మట్టి గోడలు, పాత ఇళ్లలో నివాసం ఉండేవారు వెంటనే అప్రమత్తమై ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సూచించిన సురక్షిత ప్రాంతాలకు, ప్రభుత్వ భవనాలలో ఆశ్రయం పొందవచ్చని సూచించారు. తెగిపడిన విద్యుత్ తీగలను, నీటిలో మునిగిన ట్రాన్స్‌ఫార్మర్లను, వర్షపు నీటిలో నిలిచిన విద్యుత్ స్తంభాలను తాకవద్దని, పశువులను విద్యుత్ స్తంభాల వద్ద కట్ట రాదని, విద్యుత్ ప్రమాదం జరిగితే, ఆ శాఖ అధికారులకు లేదా పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇవ్వవచ్చని సూచించారు. వరద నీరు తాగునీటి వనరులలో చేరే ప్రమాదం ఉన్నందున, వ్యాధులు ప్రబలకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగడ సురక్షితమని ,పిల్లలను చెరువులు, వాగులు, గుంతల వద్దకు పోనీయకుండా, పశువులను ఎత్తైన, సురక్షిత ప్రదేశాలలో ఉంచటం మేలని తెలిపారు.ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని, పిల్లలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. మీ గ్రామంలో ఏదైనా ఆపద లేదా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ లేదా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు ఏర్పాటుచేసిన మొబైల్ నెంబర్ 6303381852 నందు సంప్రదించాలని సూచించారు .

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)