ఏకలవ్య పాఠశాలల అద్భుత విజయం: 99.78% ఉత్తీర్ణతతో రికార్డు

G Rajashekar
By -
0

 


EB NEWS/భద్రాచలం: 


పదో తరగతి సీబీఎస్ఈ ఫలితాల్లో ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు (EMRS) అద్భుత విజయాన్ని సాధించాయి. మొత్తం 455 మంది విద్యార్థులకు గాను 454 మంది ఉత్తీర్ణులై 99.78% ఉత్తీర్ణత నమోదు చేసి రికార్డు సృష్టించారు.


ఈ వివరాలను ఐటీడీఏ పీవో బి. రాహుల్ వెల్లడించారు. రీజియన్‌లోని 8 పాఠశాలల్లో వందశాతం ఫలితాలు రావడం విశేషంగా నిలిచింది. ముఖ్యంగా బాలికలందరూ ఉత్తీర్ణత సాధించడం ప్రశంసనీయం.


అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 18 మంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించిన అధికారులు, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ విజయమని తెలిపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)