ఏటీఎం నగదు మాయం: కోటి రూపాయలతో ఇద్దరు ఉద్యోగులు పరార్

G Rajashekar
By -
0

 



EB NEWS/హైదరాబాద్:


సికింద్రాబాద్‌లో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ నగదు నిర్వహణ సంస్థలో పనిచేస్తున్న  ఇద్దరు ఉద్యోగులు ఏటీఎంలలో నింపాల్సిన రూ.1 కోటి నగదుతో పరారయ్యారు.


బోయిన్పల్లి కార్యాలయం నుంచి నగదును తీసుకుని, ఎస్.ఆర్.నగర్ పరిసరాల్లోని ఎనిమిది ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సి ఉండగా, వారు ఆ పని చేయకుండా కనిపించకుండా పోయారు. రెండు రోజుల పాటు వారు కార్యాలయానికి హాజరుకాకపోవడంతో అనుమానం వచ్చిన సంస్థ అధికారులు అంతర్గత ఆడిట్ నిర్వహించగా, భారీగా నగదు గల్లంతైన విషయం బయటపడింది.


దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.


إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)