BREAKING NEWS: పినపాకలో కాంగ్రెస్‌కు బలం… సర్పంచ్ సింధూజ చేరిక

G Rajashekar
By -
0




 EB NEWS /పినపాక : 17-04-2026


పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా విజయం సాధించిన వెంకట్రావుపేట సర్పంచ్ సుతారి సింధూజ, శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.


మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్వయంగా సింధూజకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో పినపాక మండలంలో కాంగ్రెస్ ప్రభావం మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


ఈ సందర్భంగా సర్పంచ్ సింధూజ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకర్షించాయని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.


పినపాక మండలంలో మొత్తం 23 సర్పంచ్ స్థానాల్లో ఇప్పటికే 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉండటం గమనార్హం. తాజా చేరికతో ఈ సంఖ్య మరింత బలపడింది.


ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాటూరి రవీందర్, కొప్పుల రామనాధం, గంగిరెడ్డి వెంకటరెడ్డి, కొర్సా ఆనంద్, కంది విజయ్ భరత్ రెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)