భద్రాద్రి: జాతీయ స్థాయికి ఎంపికైన ఆదివాసి ఆణిముత్యం



EB NEWS /భద్రాద్రి:


ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈనెల 26 నుండి 29 వరకు జరగనున్న జాతీయస్థాయి ఖేలో ఇండియా ట్రైబల్ ఆర్చరీ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుండి నలుగురు ట్రైబల్ క్రీడాకారులు ఎంపికయ్యారు.ఎంపికలో కరకగూడెం మండలంలోని తాటిగూడెం గ్రామానికి చెందిన కొమరం వెంకటనారాయణ భద్రాచలం ఐటిడిఏ అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ కుమారుడు కొమరం అశ్విత్ దొర ఎంపిక కావడం గర్వకారణం.


ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఆర్చరీ పోటీల్లో అశ్విత్ దొర తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యం వహిస్తూ,అత్యంత ప్రతిభ కనబరిచారు.జాతీయ స్థాయికి పోటీలకు అశ్విత్ దొర ఎంపికైనందుకు తల్లిదండ్రులు,గ్రామస్తులు, ఆర్చరీ అసోసియేషన్ వారు ప్రత్యేకంగా అభినందించారు.అదేవిధంగా ఈ నెలలో జరిగే జాతీయస్థాయి ఆర్చరీ పోటీలలో రాణించి మన ప్రాంతానికి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

1 تعليقات

إرسال تعليق

أحدث أقدم