EB NEWS/భద్రాచలం:
రేపు జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి భద్రాచలం చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిజర్వ్ పోలీసుల నుంచి డీజీపీ గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి అపరిచిత ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ ఏడాది కళ్యాణ మహోత్సవం దృష్ట్యా సుమారు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ, సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
భక్తులు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

