భద్రాచలం రాజీవ్ నగర్‌లో ఆటో దొంగతనం… ఇంటి ముందే మాయం!

G Rajashekar
By -
0



EB NEWS/భద్రాచలం:


భద్రాచలం ఐటిడిఏ రోడ్డులోని రాజీవ్ నగర్ కాలనీలో ఆటో దొంగతనం జరిగిన ఘటన కలకలం రేపింది. కాలనీలో జీవనందం స్కూల్ సమీపంలో నివసిస్తున్న ఎస్‌కే జకీర్ హుస్సేన్‌కు చెందిన బజాజ్ ప్యాసింజర్ ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు.


శనివారం రాత్రి సుమారు 12:30 గంటల సమయంలో ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన **TS 28 TA 9168** నంబర్ గల ఆటో కనిపించకుండా పోయిందని బాధితుడు తెలిపారు. ఆ ఆటో టాప్ నంబర్ **BCM/O/25** గా ఉందని చెప్పారు.


ఆటో ఎక్కడైనా కనిపిస్తే లేదా సమాచారం తెలిసిన వారు **8919418656** నంబర్‌కు సమాచారం ఇవ్వాలని జకీర్ హుస్సేన్ కోరారు. 🚨



إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)