పినపాక, EB న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం తోగ్గుడెం గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్న ప్రమాదకర మలుపు పాఠశాల పిల్లల భద్రతకు ముప్పుగా మారినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ప్రచురితమైన కథనానికి ఇప్పటికీ స్పందన లేకపోవడంతో, హెచ్చరిక బోర్డులు అందని ద్రాక్షలా మిగిలిపోయాయని వారు విమర్శిస్తున్నారు.
అనేక ప్రమాదాలు జరుగుతున్నా, పంచాయతీ స్థాయి పాలకవర్గం కూడా నిమ్మకు నీరులా వ్యవహరిస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు తక్షణమే స్పందించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రమాదాలను నివారించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి