EB NEWS/భద్రాచలం, ఫిబ్రవరి 24:
చర్ల నుంచి భద్రాచలం మీదుగా అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ బొలెరో వాహనాన్ని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు.
వాహనంలో సుమారు తొమ్మిది పశువులను అత్యంత అమానుషంగా కింద పడేసి కట్టేసి తరలిస్తున్నట్లు గుర్తించారు. పశువులకు తగిన స్థలం లేకుండా, క్రూరంగా కట్టివేసి రవాణా చేస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగించాయి.
పోలీసులు వెంటనే వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. పట్టుబడిన పశువులను భద్రాచలం పోలీస్ స్టేషన్‌కు తరలించి, తదుపరి చర్యలు చేపట్టారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి