ఖమ్మంలో భూదాన్ భూములపై మళ్లీ వివాదం…
EB NEWS/ఖమ్మం:
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా గుడిసెలు నిర్మించారని పేర్కొంటూ వాటిని తొలగించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
వేలాది మంది పోలీసులు ఒక్కసారిగా ప్రాంతానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమకు నివాస హక్కు ఉందని చెప్పుకుంటూ బాధితులు గుడిసెల తొలగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు అధికారులూ, స్థానికుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.
అధికారులు మాత్రం ఇది ప్రభుత్వ భూమి కావడంతో అక్రమ నిర్మాణాలను తొలగించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసుల సహకారంతో కూల్చివేతలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతుండగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి