భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, EB న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్ట్రాంగ్ రూమ్‌కు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు గల్లంతవడం కలకలం రేపింది. పాత పాల్వంచ ప్రాంతంలో బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్తుండగా ఓ వ్యక్తిని బీఆర్ఎస్ కార్యకర్తలు గుర్తించి పట్టుకున్నారు. ఆయన పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో, ఆ వ్యక్తిని మరియు ఒక బ్యాలెట్ బాక్స్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
47వ డివిజన్ బూత్ నెంబర్ 156 నుంచి మొత్తం 10 బ్యాలెట్ బాక్సులు మిస్సింగ్ అయినట్లు సమాచారం. ఈ ఘటనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు పాల్వంచ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అధికారులను నిలదీశారు. మిగిలిన బ్యాలెట్ బాక్సులు ఎక్కడ ఉన్నాయో తేలేదాకా స్టేషన్‌ను విడిచిపెట్టబోనని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడి ఉండొచ్చని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
బ్రేకింగ్ న్యూస్
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో హైడ్రామా
స్ట్రాంగ్ రూమ్‌కు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు గల్లంతు
పాత పాల్వంచలో బ్యాలెట్ బాక్స్ లు పట్టుకెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలకు దొరికిన ఓ వ్యక్తి
పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో బ్యాలెట్ బాక్సును, ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కి తరలించిన బీఆర్ఎస్ నేతలు
47వ డివిజన్ బూత్ నెంబర్ 156 నుండి 10 బ్యాలెట్ బాక్సులు మిస్సింగ్
పాల్వంచ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
బ్యాలెట్ బాక్సుల గల్లంతుపై పోలీసుల నిలదీసిన రేగా
ఒక పోలింగ్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
మిగతా బాక్సులు ఎక్కడ ఉన్నాయో తేలేదాకా స్టేషన్ నుంచి కదలబోనని స్టేషన్లలో బైఠాయించిన రేగా కాంతారావు
బ్యాలెట్ బాక్సుల గల్లంతుపై ప్రజల్లో అనుమానాలు
కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు తెరలేపి ఉంటుందని విపక్షాల ఆరోపణ

إرسال تعليق