ఈ నెలలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు? ప్రభుత్వంలో చర్చలు

G Rajashekar
By -
0

TELANGANA POLITICS, BHADRADRI POLITICS:

EB NEWS/TG:


రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కదలికలు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
మార్చి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన మెజారిటీ నేపథ్యంలో ఇదే ఊపులో పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
నేడు అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి కీలక సమావేశం నిర్వహించనున్నారు. రైతు భరోసా, పెన్షన్ల పెంపు అంశాలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మంత్రివర్గం నిర్ణయం అనంతరం షెడ్యూల్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. సాయంత్రం జరిగే సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)