తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హైఅలర్ట్… జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభం

G Rajashekar
By -
0

 


EB NEWS/ఛత్తీస్‌గఢ్:


తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతం మరోసారి ఉద్రిక్తంగా మారింది. అటవీ ప్రాంతాల్లో తుపాకీ శబ్దాలు, బాంబు పేలుళ్లతో పరిస్థితి దద్ధరిల్లుతోంది. మావోయిస్టు అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని భద్రతా బలగాలు విస్తృత స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.


సమాచారం మేరకు, మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు డ్రోన్లను వినియోగిస్తూ అడవుల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. సరిహద్దు దాటి చొరబాట్లు జరగకుండా ఛత్తీస్‌గఢ్ పోలీసులు, తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు సమన్వయంతో జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.


అటవీ ప్రాంతాల సమీప గ్రామాల్లో అప్రమత్తత పెంచిన అధికారులు, ప్రజలు అవసరం లేకుండా అడవుల వైపు వెళ్లవద్దని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.


సరిహద్దు ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేసినట్లు 

సమాచారం.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)