మణుగూరులో రజక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ|నాగర్‌కర్నూల్ ఘటనపై ఆగ్రహం

G Rajashekar
By -
0



 EB NEWS/ మణుగూరు:

నాగర్‌కర్నూల్ జిల్లాలో పసిపాప మృతికి కారణమైన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మణుగూరు పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ , నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. అనంతరం నిర్వహించిన సభలో నాయకులు మాట్లాడుతూ,  పసిపాప మృతికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి తగిన పరిహారం, రక్షణ కల్పించాలని సంఘ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, బీసీ కుల సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు  పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Tags:

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)