EB NEWS/అశ్వాపురం:
అశ్వాపురం మండలంలోని ఆనందపురం గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామపంచాయతీ పరిధిలోని ఒక భూమి హక్కుల విషయంలో నెలకొన్న విభేదాలు ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారి తీసినట్లు తెలుస్తోంది.
ప్రారంభంలో స్థానిక స్థాయిలోనే సాగిన ఈ తగాదా క్రమంగా ముదురుతూ పరస్పర ఆరోపణలకు దారి తీసింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రంగంలోకి దిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
దీంతో గ్రామంలో వాతావరణం రాజకీయ మలుపు తిరిగింది. ఇరువర్గాలు అశ్వాపురం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
ఈ ఘటనతో ఆనందపురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా, పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ రంగు పులుముకుంటున్న ఈ భూ వివాదం మరింత ముదరకముందే సంబంధిత రెవెన్యూ, పోలీస్ అధికారులు జోక్యం చేసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి