అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రైవేట్ స్కూల్స్ అనుమతి రద్దు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.
EB NEWS/తెలంగాణ:
ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజుల వసూళ్లు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు.. ఎన్నిసార్లు ప్రభుత్వాలకు మొకరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. రకరకాల ఖర్చుల పేరుతో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు.. విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాలు పీల్చుతున్నాయి. ఎల్‌కేజీ నుంచి మొదలుపెడితే.. ఉన్నత స్థాయి విద్య వరకు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఆగడాలు అన్నీ ఇన్నీ కాదు.
ఈ క్రమంలోనే తెలంగాణ విద్యా శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ రూపొందించేందుకు ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ అందించిన సమగ్ర నివేదిక తర్వాత సీఎం రేవంత్ రెడ్డి.. విద్యాశాఖపై కీలక సమీక్ష నిర్వహించారు.
నిబంధనలను ఉల్లంఘించి.. ప్రైవేటు పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తే.. వాటి అనుమతి రద్దుతో పాటు.. అధికంగా వసూలు చేసిన ఫీజును రికవరీ చేసేలా నిబంధనలు విధించాలని సీఎం రేవంత్ రెడ్డి.. విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఫీజుల నియంత్రణకు సంబంధించి సలహాలను ప్రజాభిప్రాయం కోసం వెబ్‍సైట్‍లో ఉంచాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యా శాఖపై సంబంధిత ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి