భద్రాద్రి కొత్తగూడెం, EB, న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 6 గంటల సమయంలో పెనగడప (రాంపురం) వద్ద గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను బొగ్గు టిప్పర్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు వి.ఎం–9 బంజార లింగగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి