మరణంలోనూ మానవత్వం — ఐదుగురికి ప్రాణం పోసిన యువకుడు

G Rajashekar
By -
0

 


ఖమ్మం జిల్లా, EB న్యూస్:


ఖమ్మం జిల్లా, మధిరకు చెందిన బీటెక్ విద్యార్థి కందిమళ్ల విజయకుమార్ తాడేపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. ఈ విషాద సమయంలోనూ ఆయన కుటుంబ సభ్యులు అత్యున్నత మానవత్వాన్ని చాటుతూ అవయవదానానికి సమ్మతించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.

విజయకుమార్ గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, రెండు కిడ్నీలు, కార్నియా దానం చేయడం ద్వారా ఐదుగురికి కొత్త జీవితం లభించింది. ఒకరి మరణం ఎన్నో జీవితాలకు వెలుగునిచ్చిన ఈ సంఘటన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.


దుఃఖాన్ని ధైర్యంగా జయించి మానవత్వాన్ని గెలిపించిన ఈ కుటుంబ నిర్ణయం నిజంగా అభినందనీయం. విజయకుమార్ జీవితం ముగిసినా, ఆయన సేవా మనసు ఎన్నో హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)