అశ్వాపురం: గ్రామ పంచాయతీకి 6 లక్షల విలువ గల భూమి విరాళం — సేవాభావానికి ప్రశంసలు

 


అశ్వాపురం, EB న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, అమ్మగారి పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం నిర్మాణం కోసం ఏలూరి శ్రీనివాస్ రావు 6 లక్షల రూపాయల విలువైన 3 కుంటల స్థలాన్ని విరాళంగా ఇచ్చి తన సేవాభావాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఇర్ప కవిత మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించడం అభినందనీయమని కొనియాడారు. గ్రామ ప్రజలు ఆయన మానవత్వాన్ని ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జామ ఖాదర్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ పాయం భద్రయ్య, మాజీ ఉప సర్పంచ్ నేలపట్ల సుధాకర్ రెడ్డి, జామ శ్రీను, ఎస్.కే. అబ్జల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

కొత్తది పాతది