పాఠాలు చెప్పాల్సిన పంతులమ్మ పసిపిల్లాడిపై దాడి

G Rajashekar
By -
0

 


రాజన్న సిరిసిల్ల జిల్లా, EB న్యూస్:


రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో అంగన్‌వాడీ కేంద్రంలో మూడున్నరేళ్ల బాలుడిపై టీచర్ దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. అల్లరి చేశాడనే కారణంతో చిన్నారిని తీవ్రంగా కొట్టినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

బాలుడికి గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ప్రేమ, సంరక్షణ అందించాల్సిన ప్రదేశంలో ఇలాంటి ఘటన జరగడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.

ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఏ ఉపాధ్యాయుడు కూడా ఇలాంటి దుర్వ్యవహారానికి పాల్పడకుండా ఉండేలా చర్యలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)