మణుగూరు బైక్ ప్రమాదం – యువకుడు మృతి

G Rajashekar
By -
0

 ROAD ACCIDENT BHADRADRI:



EB NEWS/మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, ఉడతనేని గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. మణికంఠ నగర్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో నివసించే ఇర్పా సురేష్ (22) బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్నట్లు సమాచారం.

ప్రమాదం తీవ్రంగా ఉండటంతో సురేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)