దుమ్ముగూడెం మండలంలో ఆదివాసీ కుటుంబాలకు సోలార్ లైట్లు, చాపల పంపిణీ



EB NEWS/ దుమ్ముగూడెం:

దుమ్ముగూడెం మండలంలోని చత్తీస్‌గఢ్ వలస గ్రామం మానుగట్టలో సేవా కార్యక్రమం నిర్వహించబడింది. శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రం చిన్న అరుణాచలం తరఫున, కరెంటు సదుపాయం లేని ఆదివాసి గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న 40 కుటుంబాలకు 40 సోలార్ లైట్లు మరియు 40 చాపలు పంపిణీ చేయబడినవి.

ఈ కార్యక్రమాన్ని శ్రీ శ్రీ శ్రీ శివ నాగ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించగా, దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య  చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో మిత్రులు కనుబుద్ధి దేవా అరుణ సేవ గణాలు బాలకృష్ణ, చిరంజీవి, మహేష్, మాధవి, మమత, వెంకటరమణ పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేని కుటుంబాలకు వెలుగు నింపే ఈ సేవా కార్యక్రమం స్థానికుల ప్రశంసలు అందుకుంది.

Post a Comment

కొత్తది పాతది