EB NEWS/చర్ల:
చర్ల మండల కేంద్రం లోని స్థానిక రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం లో శుక్రవారం రాహుల్ హై స్కూల్ విద్యార్థులకు కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 141 బెటాలియన్ వారి సివిక్ యాక్షన్ ప్రోగ్రాం లో భాగంగా కమాండెంట్ రితీష్ కుమార్ ఠాకూర్ ఆదేశాల మేరకు
ఇన్స్పెక్టర్ మనీష్ కుమార్ ఆధ్వర్యం లో రాహుల్
విద్యార్థులకు ఫినాయిల్ తయారీ శిక్షణా కార్యక్రమాన్ని కళాభవన్ లో నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమం లోఅతి తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే ఫినాయిల్ తయారు చేసే విధానాన్ని నిపుణులు ప్రత్యక్షంగా వివరించారు. వైట్ ఫినాయిల్ తయారీకి కావాల్సిన రసాయనాలను,నాణ్యతను పెంచే పద్ధతులు మరియు మార్కెటింగ్ నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం CRPF అధికారులు మాట్లాడుతూ CRPF కేవలం భద్రతకే పరిమితం కాకుండా, ప్రజల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం ఇలాంటి సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్‌లను నిరంతరం నిర్వహిస్తుందని తెలిపారు. రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం వారు ఈ శిక్షణ కార్యక్రమానికి సహకారం అందించడం పట్ల ప్రిన్సిపాల్ వర్మరాజు కు ధన్యవాదములు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో CRPF అధికారులు,శిక్షకులు శంకర రావు ,రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం డైరక్టర్ కొసరాజు హరిచరణ్,ఉపాధ్యాయులు బిట్రగుంట క్రాంతి కుమార్, యస్కే ఉస్మాన్, శెట్టి సునీత, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి