భద్రాద్రి, EB న్యూస్:
భద్రాద్రి : జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్‌లో జగ్గు తండ ఎంపీపీ ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి లభించిన అత్యంత విలువైన హక్కు ఓటు హక్కు అని తెలిపారు. ప్రజా స్వామ్యంలో మన గళాన్ని వినిపించ డానికి ఓటు హక్కు శక్తివంతమైన సాధనం అని అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును బాధ్యతాయు తంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. చివరి నిమిషం వరకు వేచి చూడ కుండా త్వరితగతిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి