పినపాక మండలంలో రోడ్డు ప్రమాదం – ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు

G Rajashekar
By -
0

 


పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం క్రాస్ రోడ్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఏల్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎం. ప్రవీణ్ (23), వై. శ్రీనివాస్ (24) అనే ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి బాధితులను పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)