7 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు అరెస్టు.
అశ్వాపురం: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, మొండికుంట ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 7 కిలోల ఎండు గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తుండగా వారిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టైన వారిలో ఒకరు కృష్ణా జిల్లా వెంగనాయకుని పాలెంకు చెందిన మోరుబోయిన గోపయ్య కాగా, మరొకరు సూర్యపేట జిల్లా చల్లబెల్లికి చెందిన బడేటి వెంకటేష్ అని గుర్తించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి