పినపాకలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

 


పినపాక, ఎన్ కౌంటర్ బులెట్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, భూపతిరావుపేట గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి బలం చేకూరింది. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఐదు కుటుంబాలు స్వచ్ఛందంగా పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు యేసుబాబు పటేల్, మండల అధ్యక్షులు గాండ్ల అశోక్ సమక్షంలో జరిగింది. కొత్తగా చేరిన వారికి నాయకులు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా తీన్మార్ మల్లన్న నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు.

Post a Comment

కొత్తది పాతది