మణుగూరు: గోదావరిలో పడి యువకుడు మృతి

 


మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మణుగూరు మండలంలోని తిర్లాపురం ఇసుక ర్యాంపు వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు.

మృతుడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రంజిత్ యాదవ్‌గా గుర్తించారు. అతను తిర్లాపురం ఇసుక ర్యాంపులో జెసిబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న సాయంత్రం గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో నీటిలో మునిగి గల్లంతయ్యాడు.

సమాచారం అందుకున్న స్థానిక జాలర్లు పడవలు, వలల సహాయంతో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

కొత్తది పాతది