భద్రాద్రి: ప్రభుత్వ ఆసుపత్రిలో సరికొత్త మైలురాయి

 


పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చొరవతో నేడు బూర్గంపాడు 


 తొలిసారి విజయవంతంగా ప్రసవ శస్త్ర చికిత్స


తల్లి బిడ్డను పరామర్శించిన ఎమ్మెల్యే పాయం 


భద్రాద్రి, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) చరిత్రలో శనివారం ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా వైద్యులు విజయవంతంగా ప్రసవ శస్త్రచికిత్స నిర్వహించి, స్థానిక ప్రజల దశాబ్దాల కలని సాకారం చేశారు.

తల్లి, బిడ్డ క్షేమం

సారపాకకు చెందిన భానోత్ మమత అనే మహిళకు ప్రసూతి వైద్యురాలు డాక్టర్ అనూష లక్ష్మి నేతృత్వంలోని వైద్య బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. మమత పండంటి మగబిడ్డకు జన్మనివ్వగా, ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రిలో జరిగిన ఈ తొలి ఆపరేషన్‌పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ చొరవతోనే సాధ్యం అయింది 

వాస్తవానికి ఈ సుపత్రి 2022లోనే 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ అయినప్పటికీ, సరైన మౌలిక వసతులు మరియు వైద్య పరికరాలు లేక ఆపరేషన్లు నిలిచిపోయాయి. దీనిపై స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవ తీసుకుని, జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి తక్షణమే అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చడంతో నేడు ఈ శస్త్రచికిత్స సాధ్యపడింది.

మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు ప్రారంభం కావడంతో, ఇకపై అత్యవసర ప్రసవాల కోసం భద్రాచలం లేదా కొత్తగూడెం వెళ్లాల్సిన అవసరం తప్పిందని పేద ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

కొత్తది పాతది