పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
హర్యానా – రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ చివరి క్షణంలో టైగా ముగియడంతో, గెలుపు ఎవరిదో తేల్చేందుకు నిర్వాహకులు ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. రెండు జట్ల ఆటతీరు సమానంగా ఉండటంతో, రెండు జట్లకు ఐదు రైడ్లు చొప్పున ఇచ్చి సూపర్ టై నిర్వహించారు.
ఈ సూపర్ టైలో రాజస్థాన్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఏడు రైడ్లలో రాజస్థాన్ 10 పాయింట్లు సాధించగా, హర్యానా కేవలం 4 పాయింట్లకే పరిమితమైంది. దీంతో రాజస్థాన్ జట్టు ఘనంగా గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఈ పోరు కబడ్డీ అభిమానులకు మరిచిపోలేని అనుభూతిగా నిలిచింది. చివరి నిమిషాల నుంచి సూపర్ టై వరకూ మైదానం మొత్తం ఉత్సాహంతో మార్మోగిపోయింది. ఈ విజయం రాజస్థాన్ జట్టు పట్టుదలకి, సమన్వయానికి నిదర్శనంగా నిలిచింది.

إرسال تعليق