ప్రాణాల రక్షణే లక్ష్యంగా అరీవ్ అలివ్ కార్యక్రమం – డీఎస్పీ రవీందర్ రెడ్డి

G Rajashekar
By -
0

 


అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


అరీవ్ అలివ్ కార్యక్రమంలో భాగంగా అశ్వాపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మణుగూరు ఎస్డిపిఓ శ్రీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, అతి వేగం నివారించడం ద్వారా ప్రాణ నష్టం తగ్గించవచ్చని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటూ మరెవరికీ ఇలాంటి బాధ కలగకూడదని విజ్ఞప్తి చేశారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)