మేడారం: వనదేవతలకు కానుకలు వేయడానికి డిజిటల్ హుండీ వచ్చిందోచ్...




#Telangana

మేడారం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు భక్తులు ఆన్లైన్ చెల్లింపులు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 


దర్శనం తర్వాత కానుకలు వేసేందుకు నోట్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. 


తాడ్వాయి కెనరా బ్యాంకు యంత్రాంగంతో మాట్లాడారు. 


మేడారం ప్రాంగణంలో QRకోడ్ స్కానర్లను ఏర్పాటు చేయించారు. 


వీటిని ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య ఆవిష్కరించారు.

Post a Comment

కొత్తది పాతది