పాల్వంచ, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
గంజాయిని తరలించడంలో ముఠా అప్డేట్ అయింది.. కారులో తనిఖీలు నిర్వహిస్తున్నారని ,కారు బానేట్ లో గంజాయి పెట్టీ అక్రమంగా రవాణా చేస్తుండగా ఆకస్మికంగా పాల్వంచ రహదారి పై పొగ వచ్చి కారు నిలిచిపోయింది. దీంతో బానేట్ డోర్ లేపి చూస్తే ఇంజన్ వేడికి గంజాయి కాలి బూడిద గా మారి పొగలు లేస్తున్నాయి.. ఆ ప్రాంతం నుండి గంజాయి ముఠా మాత్రం తప్పించుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి