కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కరకగూడెం మండల కేంద్రాల్లో దీపావళి పర్వదినం దృష్ట్యా ఏర్పాటు చేయనున్న క్రాకర్స్ షాపులపై ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పి. వినోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం క్రాకర్స్ షాపుల ఏర్పాటు ఖచ్చితమైన నిబంధనల మేరకు జరగాల్సిందిగా స్పష్టం చేశారు.
క్రాకర్స్ షాపులు నిర్వహించాలంటే కింది విధమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు:
1. షాపులు ఓపెన్ ఏరియాలో, అనుమతి పొందిన ప్రదేశంలోనే ఉండాలి.
2. షాప్ నిర్మాణం క్లాత్, వుడ్, టార్పాలిన్ లాంటి కాలే వస్తువులతో చేయరాదు.
3. ఎలక్ట్రికల్ వైరింగ్ నాణ్యమైనది అయి ఉండాలి. క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్ ద్వారా మాత్రమే వైరింగ్ చేయించాలి.
4. షాపులో 2 నంబర్ డీసిపి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి. అందులో ఒకటి 5 కిలోల సామర్థ్యం కలిగి ఉండాలి.
5. రెండు వాటర్ బ్యారెల్స్ ఉండాలి. అందులో కనీసం ఒకటి 200 లీటర్లు ఉండాలి.
6. స్మోకింగ్ నిషేధం అని స్పష్టంగా బోర్డులు ఏర్పాటు చేయాలి. పొగతాగడాన్ని నిరోధించే చర్యలు తీసుకోవాలి.
7. స్పార్క్ వచ్చే ఎక్విప్మెంట్ వాడకూడదు.
8. 18 ఏళ్లకు తక్కువ వయస్సు గల పిల్లలను పనిలో నియమించరాదు.
9. షాప్ లోపల మరియు చుట్టూ ప్రాంతాల్లో శుభ్రత పాటించాలి.
10. ప్రతి షాప్ మధ్య కనీసం 3 మీటర్ల గ్యాప్ ఉండేలా ఏర్పాట్లు చేయాలి.పి. వినోద్ కుమార్ తెలిపారు. ఈనిబంధనలు పాటించకపోతే, సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు పూర్తి సహకారం అందించాలని కోరారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి