దారుణం.. యాదాద్రి జిల్లాలో 6 వేల కోళ్లు మృతి



 యాదాద్రి, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పరిధి నక్కలగూడెంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి కోళ్ల ఫారంలోకి నీరు చేరి సుమారు 6 వేల కోళ్లు మృతి చెందాయి. కోళ్లు నీట మునిగి మృతి చెందడంతో తనకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని కోళ్ల ఫారం యాజమాని యాదిరెడ్డి చెప్పారు. అనూహ్య వాతావరణ మార్పుల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Post a Comment

కొత్తది పాతది