ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఓటర్లకు గందరగోళం లేకుండా ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక్కో ఎన్నికను బట్టి వేరు వేరు వెళ్లకు సిరా వేయాలని నిర్ణయించింది. MPTC, ZPTC ఎన్నికల్లో ఎడమచేతి చూపుడు వేలుపై, పంచాయతీ ఎన్నికల్లో మధ్య వేలుపై సిరాచుక్క వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలలో రెండు దశల్లో MPTC, ZPTC, ఈ నెల 31 నుంచి మూడు దశల్లో GP ఎన్నికలు జరుగుతాయని ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

