బిగ్ బ్రేకింగ్ న్యూస్: వింత ఘటన రెండు తలల దూడ జననం




Ap, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


రెండు తలల దూడ జననం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పొదిలి మండలం కుంచేపల్లిలో అన్నపురెడ్డి వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన బర్రె రెండు తలలున్న దూడకు జన్మనిచ్చింది. ఈ అరుదైన సంఘటనతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న పశువైద్యులు బ్రహ్మయ్య దూడను పరిశీలించి, జన్యులోపంతో ఇలాంటివి అరుదుగా జరుగుతాయని, ప్రస్తుతం దూడ ఆరోగ్యంగానే ఉందని తెలిపారు.





ఇది కూడా చదవండి...


ఆర్టీసీ డ్రైవర్ గారికి అర్జెంట్ అంట..!




 అదే పనిగా అరగంటగా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్.


 

షాద్ నగర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం


 నిండు ప్రాణాలను చేతిలో పెట్టుకుని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ 


 చెప్పిన పట్టించుకోకుండా అర్జంట్ అంటూ అదే పనిగా


రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీసీ డిపో నుండి శనివారం ఉదయం 10 నిమిషాలకు హైదరాబాద్ కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. షాద్ నగర్ చౌరస్తా నుండి మొదలుపెట్టి ప్రస్తుతం శంషాబాద్ వరకు వచ్చినా కూడా డ్రైవర్ అదే పనిగా ఫోన్ మాట్లాడుతూ మధ్య మధ్యలో రెండు చేతులతో ఫోన్లో మాట్లాడుతూ స్టీరింగ్ విడిచిపెట్టి మరి విన్యాసాలు చేస్తూ ప్రయాణికులకు కంటపడడంతో వారు బిక్కు బిక్కున ప్రయాణం చేస్తున్నారు. ఓవైపు స్పీడుగా వెళ్తూనే మరోవైపు ఫోన్ కాల్ అదే పనిగా నిరంతరం మాట్లాడుతూ కనిపించాడు. ఇదేమని బస్సులో విట్యాలకు చెందిన ఇసాక్ అనే యువకుడు డ్రైవర్ ను ప్రశ్నించగా తనకు అర్జెంటు ఉంది అంటూ నిర్లక్ష్యం సమాధానం చెప్పాడు. ఇలా చేతులు విడిచిపెట్టి అస్తమానం డ్రైవింగ్ చేస్తూ ఉంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా అతను ఏమాత్రం పట్టించుకోకుండా బేఖాతరు చేస్తూ డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. అతను తీసిన వీడియోలో కూడా ఒక్కోసారి స్టీరింగ్ రెండు చేతులు విడిచిపెట్టి మరి డ్రైవింగ్ చేస్తూ ఫోన్ పట్టుకొని మాట్లాడడం దృశ్యాలు కనిపించాయి. షాద్ నగర్ ఆర్టీసీ బస్సు నంబర్ టీఎస్ 07యుజే 888. ప్రయాణికులు ఇదేం చోద్యం అని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని తాటికాయ అంత అక్షరాలతో ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే డ్రైవర్లు మాత్రం ఇలా నిర్లక్ష్యంగా తమకు అవసరం పడిందని డ్రైవింగ్ చేస్తూ నిరంతరంగా ఫోన్లు మాట్లాడుతూ విన్యాసాలు చేస్తూ ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి నడుపుతున్న తీరు సర్వత్ర ఆక్షేపనీయం..

Post a Comment

أحدث أقدم