తమ వెబ్ సైట్‌బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయట పెడతామంటూ ప్రకటన..
5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉందంటూ బెదిరింపులు..
మీడియా, OTT, హీరోలకు షాకింగ్ రివీల్ అవుతుంది..
ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది.. వెనక్కి తగ్గం..
మా సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులకు కనపడవు..
OTTలు, హీరోలు, మీడియా అందరి వివరాలు బయటకు వస్తాయి..
మమ్మల్ని అడ్డుకోవడం కష్టమే.. ఆపడం అసాధ్యం..
మమ్మల్ని ఆపలేరు.. వెతకలేరంటూ ఐ బొమ్మ ప్రకటన
గత కొన్ని సంవత్సరాలుగా కొత్త కొత్త సినిమాలను ఐ బొమ్మ వెబ్సైట్ వేదికగా పైరసీ సినిమాలను రిలీజ్ చేస్తూ... వేలకోట్ల రూపాయలు నష్టం కలిగిస్తూ... విచ్చలవిడిగా విర్రవీగుగుతుంది. సినిమా థియేటర్లో రిలీజ్ అయిన మరుసటి రోజే పైరసీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతలా భరితగించిందంటే పోలీసులకే వార్నింగ్ ఇస్తుంది. ఐదు కోట్ల మంది యూజర్ల డేటా మా దగ్గర ఉందని ఐ బొమ్మ సంచలన వ్యాఖ్యలు చేసింది. మమ్మల్ని అడ్డుకోవడం కష్టమే అంటూ పోలీసులకే సవాల్ విసురుతుంది. ఫ్రీగా కొత్త సినిమాలు వస్తున్నాయని యూసర్లు సినిమాలు చూస్తే... అదే ఇప్పుడు మన మెడకు చుట్టుకుందనే చెప్పొచ్చు. మా వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు బయటపెడతామంటూ బ్లాక్మెయిల్ చేస్తుంది. పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి